Virat Kohli: ఐపీఎల్‌లో ఫేవ‌రెట్ టీం అదే

Virat Kohli says kkr is his favorite rival

Virat Kohli:  కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్ రంగంలో అడుగుపెట్టి నేటికి 18 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో త‌న‌కు న‌చ్చిన ప్ర‌త్య‌ర్థి టీం ఎవ‌రో చెప్పాడు. త‌న‌కు ఐపీఎల్‌లో 3 సార్లు ఛాంపియ‌న్ అయిన క‌ల‌క‌త్తా నైట్ రైడర్స్ అంటే ఇష్ట‌మ‌ని తెలిపాడు. ఇక ఇష్ట‌మైన మైదానం ఏంటి అని అడ‌గ్గా.. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం అని చెప్పాడు. 2008లో కోహ్లీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆడ‌టం మొదలుపెట్టాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం త‌ర‌ఫున 17 సీజ‌న్లు ఆడిన ఏకైక ఆట‌గాడు విరాటే.