Virat kohli: బాబోయ్.. ఇది క‌లా నిజమా?

Virat kohli: నేను సూసింది.. సూత్తుంది నిజ‌మేనా.. అనిపించేలా ఉంది క‌దూ ఈ ఫోటో..! లేక‌పోతే.. విరాట్ కోహ్లీ.. (Virat Kohli) గౌత‌మ్ గంభీర్‌ని (Gautam Gambhir) హ‌గ్ చేసుకోవ‌డం ఏంటి? గంభీర్‌ ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ త‌ర‌ఫున ఆడుతున్న స‌మ‌యంలో విరాట్‌కి గంభీర్‌కి మధ్య గొడ‌వ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టినుంచి వీరి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. నిన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌కి మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు చిత్తుగా ఓడిపోయింది. అయితే మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కోహ్లీ.. గంభీర్ ప‌క్క‌కు వెళ్లి హ‌గ్ చేసుకున్న దృశ్యం వైర‌ల్‌గా మారింది. దీనిపై ర‌విశాస్త్రి స్పందిస్తూ.. వీరిద్ద‌రికీ ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాల‌ని అన్నారు. ఆ వెంట‌నే సునీల్ గ‌వాస్క‌ర్ స్పందిస్తూ.. ఫెయిర్ ప్లే మాత్ర‌మే కాదు.. ఆస్కార్ ఇవ్వాలి అని చ‌మ‌త్క‌రించారు.

గ‌తేడాది ఐపీఎల్ స‌మ‌యంలో ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు మ‌ధ్య మ్యాచ్ జరుగుతున్న స‌మ‌యంలో గౌత‌మ్ గంభీర్ నోరు మూసుకోండి అని సైగ చేయ‌డం.. ఆ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కూడా అలాగే సైగ‌లు చేయ‌డంతో ఇరు టీంల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. ఆ త‌ర్వాత విరాట్ గంభీర్ వాద‌న‌కు దిగారు. నువ్వు నాకు ఆట నేర్పిస్తావా అంటూ గంభీర్ విరాట్‌పై కేక‌లు వేయ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

ALSO READ: Virat Kohli: నాకు ఆ గుర్తింపు వ‌ద్దు.. అందుకే దూరంగా ఉన్నాను