Virat Kohli: ఏం త‌గ‌ల‌బెట్ట‌మంటారు?

virat kohli funny reaction on border gavaskar trophy

Virat Kohli: కింగ్ కోహ్లీ సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ ఉన్న వ్య‌క్తి. త్వ‌ర‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదిక‌గా బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ అభిమాని చెప్పిన మాట‌కు కోహ్లీ స్పందించిన తీరు నెట్టింట్లో న‌వ్వులు పూయిస్తోంది. నిన్న కోహ్లీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో త‌న భార్య అనుష్క శ‌ర్మ‌, పిల్ల‌ల్ని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లాడు. వారిని తీసుకుని వెళ్తుండ‌గా.. కొంద‌రు అభిమానులు కోహ్లీ భాయ్‌.. బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో పెర్ఫామెన్స్‌తో త‌గ‌ల‌బెట్టేయాలి అన్నారు. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. ఏంటి.. ఏం త‌గ‌ల‌బెట్టాలి అని అడిగ్గా వారంతా న‌వ్వుకున్నారు. అప్పుడు ఆ అభిమాని స్పందిస్తూ.. బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీ గురించి చెప్తున్నాను అన‌గా.. అప్పుడు కోహ్లీ అచ్చా ఓకే అని చెప్పి వెళ్లిపోయాడు.