జింబాబ్వే T20Iల‌కు మొన‌గాళ్లు దూరం.. ఇత‌నే కెప్టెన్

Virat Kohli and rohit sharma will not be there for t20I

Virat Kohli: జులై 6 నుంచి జ‌ర‌గ‌నున్న 5 సిరీస్‌ల T20I మ్యాచ్‌ల‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్ప్రీత్ బుమ్రాను దూరం కానున్నారు. ఈ మ్యాచ్‌ల‌కు దాదాపు సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఆడే అవ‌కాశం లేదు. దాంతో ఈ సిరీస్‌ల‌కు కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక‌చేసారు. ఈ సిరీస్‌ల‌లో సీనియ‌ర్లు కాకుండా IPL స్టార్లు పాల్గొన‌నున్నారు. అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హ‌ర్షిత్ రాణా, సంజు శాంస‌న్, య‌శ‌స్వి జైస్వాల్, రింకూ సింగ్‌లు ఆడ‌నున్నారు. ఈ సిరీస్‌కి కోచ్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రిస్తారు. జులై 27 నుంచి శ్రీలంక టూర్‌లో భాగంగా కొత్త హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ బాధ్య‌త‌లు తీసుకుంటారు.

ఈ సిరీస్‌లో టీమిండియా స్క్వాడ్ ఇదే

శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్)

రింకూ సింగ్

సంజూ శాంసన్ (వికెట్ కీప‌ర్)

అభిషేక్ శ‌ర్మ‌

నితీష్‌కుమార్ రెడ్డి

హ‌ర్షిత్ రాణా

య‌శ్ ద‌యాళ్‌

ఖ‌లీల్ అహ్మ‌ద్

ఆవేశ్ ఖాన్

యుజ్వేంద్ర చాహ‌ల్

ర‌వి బిష్ణోయ్‌

రియ‌న్ ప‌రాగ్

ర‌జ‌త్ పాటిదార్

ధృవ్ జురేల్ (వికెట్ కీపర్)