CAS: ఫోగాట్‌కు నెలసరి సమయం.. అందుకే డిస్‌క్వాలిఫై చేసాం
CAS: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్ నుంచి డిస్‌క్వాలిఫై అయ్యి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఫోగాట్ ఫైనల్స్‌కు వచ్చేసరికి 100 గ్రాములు అధిక బరువు ఉందన్న ఒక్క కారణంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేసారు దాంతో సెమీ ఫైనల్స్ వరకైనా వచ్చింది కాబట్టి ఆమెకు రజతం ఇవ్వాలని CASను కోరగా.. ఇందుకు CAS ఒప్పుకోలేదు. రూల్ ఎవరికైనా రూలే అని.. బరువును నియంత్రించుకోవడం అనేది పూర్తిగా అథ్లెట్ బాధ్యతే అని తీర్పును వెల్లడించింది.
అయితే సీఏఎస్ వెల్లడించిన తీర్పులో కొన్ని కీలక విషయాలను పేర్కొంది. వినేష్ రెజ్లింగ్‌లో రౌండ్ 2లో పాల్గొన్నప్పుడు నాలుగు సార్లు కుస్తీలో పాల్గొందని.. దాంతో ఆమె తినేందుకు బరువును చెక్ చేసేందుకు మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అదీకాకుండా వినేష్‌కు నెలసరి రాబోతున్న సమయం కావడంతో ఆమె బ్లోటింగ్, హార్మోనల్ సమస్యలతో ఉందని దాని వల్లే బ్లోటింగ్ (కడుపు ఉబ్బడం) వంటి సమస్యల వల్ల 100 గ్రాములు బరువు అధికంగా చూపించిందని వెల్లడించింది.
అదీకాకుండా బరువు చెక్ చేసే మెషీన్‌లో కూడా ఏదో లోపం ఉందని అందుకే ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నప్పటికీ 50 గ్రాములు మాత్రమే చూపించిందని.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఆమెను డిస్‌క్వాలిఫై చేసామని పేర్కొంది. అయితే.. ఆమెను కేవలం ఫైనల్స్ నుంచి తొలగించకుండా మొత్తం కాంపిటీషన్ నుంచే డిస్‌క్వాలిఫై చేయడం కరెక్ట్ కాదని CAS అభిప్రాయపడింది.