Vinesh Phogat: భారత్‌కు చేరుకున్న ఫోగాట్.. మీడియా ముందు కంటతడి
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఈరోజు ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులు, ఇతర రెజ్లర్లను చూడగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన సహ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను పట్టుకుని కన్నీరుమున్నీరయ్యారు. పక్కనే ఉన్న భజరంగ్ పూనియా వినేష్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. వినేష్ ఏడుస్తుంటే అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.