Varun Aaron: MI లోకి ఎందుకొచ్చానా అని హార్దిక్ బాధపడుతున్నాడు
Varun Aaron: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టీంలోకి ఎందుకొచ్చానా అని హార్దిక్ పాండ్య (Hardik Pandya) బాధపడుతున్నాడని తెలిపారు మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి పాండ్య పాపం ఎన్నో ట్రోల్స్, అవమానాలు ఎదుర్కొంటున్నాడు. అతని ఆటతీరు కూడా పేలవంగానే ఉంది. ప్రస్తుత IPL సీజన్‌లో ముంబై ఇండియన్స్ కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచి తొమ్మిదో పొజిషన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో టీ20 వరల్డ్ కప్ రాబోతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యకు బదులు శివమ్ డూబేని ఎంపికచేస్తే బాగుంటుందని వరుణ్ ఆరోన్ తెలిపారు.
“” హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నంత వరకు బాగానే ఆడాడు. అయినప్పటికీ తనకు ముంబై ఇండియన్స్‌పై ఉన్న ఇష్టంతో గుజరాత్ టైటాన్స్‌ని వదులుకున్నాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్య ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు హార్దిక్ మైండ్‌లో ఒక్కటే ఉంది. నేను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు రన్నర్స్ అప్‌గా అయినా గెలిచాం.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి అనవసరంగా వచ్చి ఇరుక్కున్నా అని కచ్చితంగా హార్దిక్ ఫీలవుతున్నాడు. పాండ్యపై ఉన్న ఒత్తిడిని తొలగిస్తే అతను వండర్స్ సృష్టిస్తాడని మాత్రం చెప్పగలను “” అని తెలిపారు వరుణ్ ఆరోన్