CSK vs RCB: నేడే రుతుకి తొలి పరీక్ష
CSK vs RCB: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ఈరోజు నుంచే మొదలుకానుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్‌కి (Chennai Super Kings) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి (Royal Challengers Banglore) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఎంపికయ్యారు. రుతురాజ్‌కు తొలి కెప్టెన్సీ ఇది. అందులోనూ ఈరోజు కెప్టెన్‌గా తొలి మ్యాచ్ జరగనుంది. దాంతో రుతురాజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రుతురాజ్‌పై సాధారణంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఎలా పెర్ఫామ్ చేస్తాడు.. కెప్టెన్‌గా ధోనీని మించిపోతాడా లేదా అని చాలా ప్రశ్నలు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మదిలో ఉన్నాయి.
టీంలో ధోనీ, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కచ్చితంగా గైక్వాడ్‌ను గైడ్ చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఫీల్డ్‌లో మాత్రం గైక్వాడ్‌ని కెప్టెన్‌గానే చూడాలి. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా చివరికి గైక్వాడ్ ఆటతీరు కెప్టెన్సీపైనే ఫోకస్ ఉంటుంది. అయితే ఇప్పుడు టాపిక్ అంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గురించే. సిరాజ్ గత మ్యాచ్‌లలో వరుస రికార్డులు సృష్టించాడు. ఇక ఈరోజు మ్యాచ్‌లో రుతు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తే రుతు దానిని ఎలా ఎదుర్కొంటాడు అనేది వేచి చూడాలి. మొత్తానికి ఈరోజు రుతుకి అగ్ని పరీక్షే అని చెప్పాలి. (CSK vs RCB)