Virat Kohli కి కొడుకు పుట్టాడ‌ని పాకిస్తాన్ లో ఏం చేసారో తెలుసా?

Virat Kohli: రన్ మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇటీవ‌ల‌ విరాట్ కోహ్లి-అనుష్క శ‌ర్మ (Virat Kohli Anushka Sharma) దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 15న అనుష్క శ‌ర్మ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని కోహ్లి దంప‌తులు మంగ‌ళ‌వారం అభిమానుల‌తో పంచుకున్నారు. త‌మ కుమారుడికి అకాయ్ (Akaai) అని పేరును పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

విరాట్ కి కొడుకు పుట్ట‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌లో సైతం అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డం విశేషం. స్వీట్లు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. జూనియ‌ర్ కోహ్లి తండ్రి బాట‌లోనే ప‌య‌నించాల‌ని, అత‌డి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

మా కుమారుడు అకాయ్‌ను ఫిబ్ర‌వ‌రి 15న ఈ లోకంలోకి స్వాగ‌తించాం. మా జీవితంలోనే అత్యంత మ‌ధుర‌మైన ఈ స‌మ‌యంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్ష‌ల‌ను కోరుకుంటున్నాము. మా వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను గౌర‌వించాల‌ని కోరుకుంటున్నాం అని మంగ‌ళ‌వారం అకాయ్ గురించి వెల్ల‌డించే స‌మ‌యంలో కోహ్లి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

అయితే తనకు కొడుకు పుట్టాడని, అతని పేరు అకాయ్ అని పెట్టామని సోషల్ మీడియాలో కోహ్లీ పోస్ట్ చేసిన నాటి నుంచి ఒకటే హడావిడి. సోషల్ మీడియా లో చర్చ మొత్తం అతడి చుట్టే తిరుగుతోంది. తమకు మొదటి సంతానంగా కూతురు పుట్టిన నేపథ్యంలో ఆమెకు విరాట్, అనుష్క దంపతులు వామిక అనే పేరు పెట్టారు. దుర్గాదేవి రూపం కాబట్టి తమ కూతురికి వామిక అనే పేరు పెట్టామని అప్పట్లో విరాట్ ప్రకటించాడు. ఇప్పుడు రెండవ సంతానంగా కుమారుడు పుట్టడంతో అతడికి అకాయ్ అని పేరు పెట్టారు.

ALSO READ: AB de Villiers: విరాట్ కోహ్లీ గురించి త‌ప్పుగా చెప్పా.. సారీ

కోహ్లి త‌న కుమారుడికి అకాయ్ అని నాయ‌క‌ర‌ణం చేయ‌డంతో ఈ పేరుకు ఉన్న అర్థ‌మేమిటో తెలుసుకోవాల‌ని చాలా మంది భావిస్తున్నారు. దీనికి నిపుణులు రెండు ర‌కాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ ప‌దానికి అమ‌రుడు, చిరంజీవుడు అని అర్థం వ‌స్తుంది. అలాగే హిందీలో కాయ్ అంటే శ‌రీరం అని.. అకాయ్ అంటే భౌతిక శ‌రీరానికి మించిన వాడు అని అర్థం వ‌స్తుంది.

ఇక, అకాయ్ అనే పేరు టర్కీష్ మూలానికి చెందినది. టర్కీ భాష ప్రకారం అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థం.. అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమిలో చంద్రుడు ఎలాగైతే నిండుగా ప్రకాశిస్తాడో.. ఆ రూపాన్ని టర్కీలో అకాయ్ అని పిలుస్తారు. తన కుమారుడు జీవితం మొత్తం అలాగే ప్రకాశించాలని కోరుకుంటూ అకాయ్ అనే పేరును విరాట్ పెట్టి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టర్కీ వాసులు కూడా రంజాన్ నెల తర్వాత పుట్టిన తన పిల్లలకు ఇదే పేరు పెట్టుకుంటారట.. అకాయ్ అంటే దేవుడి కుమారుడిగా భావిస్తారట.

రెండవ సారి తండ్రి అవుతున్నాననే విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ.. అప్పటినుంచి యాక్టివ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వరల్డ్ కప్ ముందు తన భార్యకు వైద్య పరీక్షలు చేయించే నిమిత్తం ముంబై వెళ్లాడు. అనంతరం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 15న అకాయ్ కి అనుష్క జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా మంగళవారం ప్రకటించాడు. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యత కు సహకరించాలని అభిమానులను కోరాడు.