నో డేటా.. నో బయోడేటా.. గంభీర్ గెలుపు మంత్రం ఇదే
Gautam Gambhir: నువ్వు ఎంత పెద్ద తోపు క్రికెటర్ అయినా నాకు సంబంధం లేదు.. గతంలో మీ ఆట తీరు డేటాతో కూడా నాకు సంబంధం లేదు.. నా ఫోకస్ అంతా ప్రస్తుతం కళ్ల ముందు జరుగుతున్న ఆట మీదే.. కలకత్తా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ సక్సెస్ మంత్రా ఇదే. తనదైన శైలిలో గేమ్‌పై ఫోకస్ చేస్తూ కలకత్తా నైట్ రైడర్స్‌కు మూడో ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టాడు.
ఇందుకు కారణం ఏంటో ఇతర క్రికెటర్లు వెల్లడించారు. గంభీర్ అన్క్యాప్డ్ ఆటగాళ్లపైనే దృష్టి పెడతాడు. తన టీంలో ఎంతటి తోపు ఆటగాడు ఉన్నా.. అతనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువగా కొత్త వారిపై ఫోకస్ పెడతాడు. డ్రెస్సింగ్ రూంలో లేని పోని టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడు. 2008లో తన విశ్వరూపాన్ని చూపించిన బ్రెండన్ మెక్‌కలమ్‌ను పక్కన పెట్టి మరీ గంభీర్ మన్వీందర్ బిస్లా అనే కొత్త ఆటగాడికి అవకాశం ఇచ్చాడంటే గంభీర్ మైండ్ గేమ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గంభీర్ వద్దకు వెళ్లి గతంలో నేను ఇన్ని సిక్సులు బాదాను..ఇన్ని వికెట్లు తీసాను అంటే ఒక్కటే మాట అంటాడు. పాత డేటా నాకు అనవసరం. ఇప్పుడు నా కళ్ల ముందు ఎలా ఆడుతున్నావో అదే నాకు ముఖ్యం అంటాడు.
ప్రతి సీజన్లో అన్క్యాప్డ్ ఆటగాళ్ల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ గంభీర్ మెంటార్షిప్లో మాత్రం టాప్ ప్లేయర్ల కంటే అన్క్యాప్డ్ ప్లేయర్లకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కలకత్తా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చి పదేళ్ల పాటు కలకత్తా నైట్ రైడర్స్తోనే కొనసాగాలని చెప్పాడు. కానీ ఇప్పుడు గంభీర్ టీమిండియా కోచ్ పదవి తీసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇందుకు షారుక్ ఖాన్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.