Barbados: హరికేన్ బీభత్సం.. బార్బడోస్‌లో ఇరుక్కున్న టీమిండియా
Barbados: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌లోని బార్బడోస్‌కు వెళ్లింది. మ్యాచ్ అయిపోయిన నేపథ్యంలో వారు బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు అక్కడి నుంచి దుబాయ్ ద్వారా భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ బార్బడోస్‌లో ప్రస్తుతం బెరిల్ అనే హరికేన్ సంభవించింది. దాంతో విమానాలన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అక్కడే చిక్కుకున్నారు. వారు భారత్ రావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని స్థానిక అధికారులు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే.. టీమిండియా క్రికెటర్లు హిల్టన్ అనే హోటల్‌లో ఉంటున్నారు. ఈ హోటల్ సముద్ర తీరానికి చేరువలోనే ఉంది. దాంతో మూడో కేటగిరీ హరికేన్ హోటల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్తున్నారు.