IND vs BAN: అడిగి మ‌రీ త‌న్నించుకోవ‌డమంటే ఇదేనేమో

tamim iqbal gets brutal reply from murali karthik

IND vs BAN: అక్టోబ‌ర్ 6న గ్వాలియ‌ర్‌లో జ‌రిగిన ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ T20I సిరీస్‌లో మ‌యాంక్ యాద‌వ్ తొలి అంత‌ర్జాతీయ అవకాశాన్ని ద‌క్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో త‌నే బౌలింగ్‌తో స‌త్తా చాటిన మ‌యాంక్‌కు అంత‌ర్జాతీయ సిరీస్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కింది. తొలి సిరీస్‌లో త‌న బౌలింగ్‌తో మ‌హ్మ‌దుల్లా వికెట్‌ను తీసాడు. మ‌హ్మ‌దుల్లాకి వేసిన బంతి వేగం గంట‌కు 149 కిలోమీట‌ర్ల మేర ఉంటుంది. రెండో మ్యాచ్‌లో త‌న వ‌రుస బౌలింగ్ స్పీడ్ గంట‌కు 146.7 కిలోమీట‌ర్ల మేర ఉంది.

సిరీస్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బంగ్లాదేశ్‌కి చెందిన కమెంటేట‌ర్ త‌మీమ్ ఇక్బాల్ మ‌యాంక్ యాద‌వ్ బౌలింగ్ స్పీడ్‌పై కామెంట్ చేసాడు. గంట‌కు 150 కిలోమీట‌ర్ల వేగంతో కూడా బౌలింగ్ చేయ‌లేక‌పోయాడు అన్నాడు. దాంతో ప‌క్క‌నే ఉన్న మ‌న కామెంటేట‌ర్ మురళీ కార్తిక్ మీ బౌల‌ర్లు కూడా అంత వేగంతో వేయ‌లేక‌పోయారు క‌దా అని ముఖం ప‌గిలేలా స‌మాధానం ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది. అడిగి మ‌రీ ఎలా త‌న్నించుకోవాలో బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల‌ను చూసి నేర్చుకోవాలి.