బుద్ధుందా నీకు.. ఇప్పుడు గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఎందుకు?

sunil gavaskar slams dinesh karthik for talking about gavaskar trophy match

Sunil Gavaskar: పుణెలో టీమిండియా న్యూజిల్యాండ్‌తో రెండో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. నిన్న మ్యాచ్‌లో టీమిండియా బాగానే ఆడిన‌ప్ప‌టికీ టాప్‌లో అయితే కివీసే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ ప‌క్క‌నే స‌హ కామెంటేట‌ర్‌గా ఉన్న దినేష్ కార్తిక్‌.. ఉన్న‌ట్టుండి న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీ గురించి ప్ర‌స్తావించాడు. దాంతో గ‌వాస్క‌ర్‌కి ఒళ్లు మండింది. బుద్ధుందా నీకు. అస‌లే మ‌నవాళ్లు గెలుస్తారో లేదో అనే టెన్ష‌న్‌లో ఉంటే ఇప్పుడు గ‌వాస్క‌ర్ ట్రెఫీ ఆస్ట్రేలియా గురించి మాట్లాడ‌టం అవ‌స‌ర‌మా అని మండిప‌డ్డారు. దాంతో పాపం కార్తిక్ సారీ చెప్పి ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. ప్ర‌స్తుతం న్యూజిల్యాండ్‌పై దృష్టి పెడితే బాగుంటుంద‌ని.. ఒక మ్యాచ్ త‌ర్వాత మ‌రో మ్యాచ్ గురించి ఆలోచిస్తే బాగుంటుంద‌ని గ‌వాస్క‌ర్ టీమిండియాకు స‌ల‌హా ఇచ్చారు.