“అబ‌ద్ధాలెందుకు.. భ‌య‌ప‌డే క‌దా సుంద‌ర్‌ని తీసుకున్నారు”

sunil gavaskar says wsahington sundar was picked more for his batting ability than his bowling

Washington sundar: టీమిండియా న్యూజిల్యాండ్‌తో ఆడ‌బోయే రెండో టెస్ట్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ని తీసుకున్నారు. అస‌లు సుంద‌ర్ 15 మెంబ‌ర్ స్వ్కాడ్‌లో లేనేలేడు. అలాంటిది స‌డెన్‌గా అత‌న్ని ఎంపిక‌చేసాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌.  తొలి టెస్ట్‌లో న్యూజిల్యాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో గంభీర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. సుంద‌ర్‌ని తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి అని గంభీర్‌ని అడ‌గ్గా.. న్యూజిల్యాండ్ టీంలో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ‌గా ఉన్నార‌ని వారిని ఎదుర్కొనేందుకు సుంద‌ర్‌ని తీసుకున్నామ‌ని గంభీర్ అన్నాడు.

కానీ ఆ సాకు న‌మ్మేలా లేద‌ని అన్నారు మాజీ క్రికెట‌ర్ సునీల్ గవాస్క‌ర్. లెఫ్ట్ హ్యాండ‌ర్స్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు కుల్దీప్ యాద‌వ్‌ని తీసుకోకుండా సుంద‌ర్‌ని తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. లోవ‌ర్ ఆర్డ‌ర్‌కి భ‌య‌ప‌డి గంభీర్ సుంద‌ర్‌ని ఎంపిక‌చేసాడ‌ని.. అందులోనూ బౌలింగ్ కోసం కాకుండా బ్యాటింగ్ కోస‌మే ఎంపిక‌చేసాడ‌ని అన్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్ప‌కుండా అబ‌ద్ధం చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని విమ‌ర్శించారు.