Sunil Gavaskar: ఇక ధోనీ IPL ఆడ‌టం మానేస్తే బెట‌ర్

Sunil Gavaskar says ms dhoni should not play ipl

Sunil Gavaskar:  ఎంఎస్ ధోనీ ఇక IPL ఆడ‌టం మానేస్తే బెట‌ర్ అని అన్నారు మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్. అయితే ధోనీ రిటైర్మెంట్ మాత్రం ఎప్ప‌టికీ ప్ర‌క‌టించ‌కూడద‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. ఈసారి ఐపీఎల్‌లో ఎలిమినేట‌ర్ మ్యాచ్ నుంచి ఓడిపోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రఫున వ‌చ్చే ఏడాది ధోనీ ఆడ‌తాడో లేదో అనే సందేహం ఇప్ప‌టికీ చాలా మందికి ఉంది. ధోనీ త‌న రిటైర్మెంట్ అంశంపై ఏం ప్ర‌క‌టిస్తారా అని BCCI కూడా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోంది. అయితే త‌న రిటైర్మెంట్ గురించి ప్ర‌క‌టించేందుకు ఇంకా స‌మ‌యం కావాల‌ని ధోనీ చెప్పాడు.

దీనిపై సునీల్ గ‌వాస్కర్ స్పందించారు. “” జులై 7న ధోనీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకుంటున్నాను. ఐపీఎల్ నుంచి ధోనీ అస‌లు రిటైర్ అవ్వ‌కూడ‌దు. కాక‌పోతే ఐపీఎల్‌లో ఆడ‌క‌పోతే బెట‌ర్. రిటైర్ అవ్వ‌నంత కాలం ధోనీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడే అవ‌కాశం ఉంటుంది. అదే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే ఆడ‌లేడు “” అని తెలిపారు.