Subramaniam Badrinath: ఆరోజు ధోనీకి వచ్చిన కోపం నేను మర్చిపోలేను
Subramaniam Badrinath: మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా సరే కోపం, చిరాకు ప్రదర్శించకుండా కూల్‌గా డీల్ చేయడంలో ధోనీ స్పెషల్. అయితే ధోనీకి కోపం వచ్చిన రోజు అతను ఎలా ప్రవర్తించాడో వివరించాడు ధోనీ మాజీ సహ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రినాథ్. ఓసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతి స్వల్ప స్కోర్‌ను కూడా సూపర్ కింగ్స్ ఛేదించలేకపోయింది. దాంతో ధోనీ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి కోపంలో వాటర్ బాటిల్‌ని తన్నడం తాను చూసానని.. ఎంతో కూల్‌గా ఉండే ధోనీలో ఇంత కోపం ఆవేశం ఉన్నాయా అని తాను షాకయ్యానని తెలిపాడు.