Steve Smith: అమ్మో.. ఇండియాను ఓడించ‌లేం

Steve Smith says it is hard to beat india

Steve Smith: త్వ‌ర‌లో భార‌త్ ఆస్ట్రేలియా మ‌ధ్య బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. అమ్మో.. టీమిండియాను ఓడించ‌డం క‌ష్టం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. గ‌త కొన్నేళ్లుగా టీమిండియా ఇర‌గ‌దీస్తోంద‌ని చివ‌రి రెండు సిరీస్‌ల‌లో ఆస్ట్రేలియాపై ఇండియానే గెల‌వ‌డంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ విష‌యంలో ఇండియాతో త‌ల‌ప‌డ‌టం క‌ష్ట‌మైన ప‌నే అని అన్నారు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు భారం త‌న‌పై ప‌డింద‌ని.. టీమిండియాతో జాగ్ర‌త్త‌గా ఆడేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నామ‌ని తెలిపారు.

టీమిండియాను సొంత గ‌డ్డ‌పైనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ ఓడించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌న‌ని.. బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ కోసం తాము ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్ అయిన బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ న‌వంబ‌ర్ 22న పెర్త్‌లో మొద‌లుకానుంది. పెర్త్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మిగ‌తా మ్యాచ్‌లు అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలో జ‌ర‌గ‌నున్నాయి.