Srilanka Series: ఆ ముగ్గురూ లేరు.. లంక పగ తీర్చుకుంటుంది
Srilanka Series: త్వరలో జరగబోయే T20I శ్రీలంక సిరీస్‌కు ముగ్గురు బెస్ట్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు దూరం కానున్నారు. ఇక T20లు ఆడమని వారు ప్రకటించేసారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించిన టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆశలన్నీ సూర్యపైనే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్, తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య కీలక వ్యాఖ్యలు చేసారు. కోహ్లీ, రోహిత్, జడేజా వంటి టాప్ క్రికెటర్లు శ్రీలంక సిరీస్‌లో లేకపోవడం తమకు కలిసొచ్చే అంశం అని అన్నారు. వారు లేరు కాబట్టి కచ్చితంగా లంక గెలిచి పగ తీర్చుకోవాలన్న కసితోనే ఆడుతుందని పేర్కొన్నారు.