Shoaib Akhtar: T20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియాదే

Shoaib Akhtar says team india will win t20 world cup

Shoaib Akhtar:  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న T20 వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో చివ‌రి విజయం టీమిండియాదే అని తెలిపారు పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయెబ్ అక్త‌ర్. ఇటీవ‌ల టీమిండియా ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శ‌ర్మ ప్ర‌ణాళిక చూస్తుంటే వ‌రల్డ్ క‌ప్ టీమిండియాకే వ‌రిస్తుంద‌ని అనిపిస్తోందని అక్త‌ర్ అన్నారు. “” ఈసారి వ‌రల్డ్ క‌ప్ ఇండియాదే. నా మ‌ద్ద‌తు ఇండియాకే. చాలా బాగా ఆడారు. గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా మీకే ద‌క్కాల్సి ఉంది కానీ ఈసారి మాత్రం మిస్స‌వ్వ‌దు. రోహిత్ శ‌ర్మ ప్ర‌ణాళిక చూస్తుంటే క‌ప్ ప‌ట్టుకునే అర్హ‌త అత‌నికే ఉంది అనిపిస్తోంది “” అని తెలిపారు.