Shiva Singh: రుతురాజ్ వల్ల క్రికెట్ వదిలేద్దామనుకున్నా
Shiva Singh: రుతురాజ్ గైక్వాడ్ వల్ల క్రికెట్ వదిలేయాలని అనుకున్నానని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు బౌలర్ శివ సింగ్. 360 డిగ్రీ బౌలర్‌గా పేరుగాంచిన శివ.. 2022లో విజయ్ హజారే క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఆ సమయంలో మహారాష్ట్ర టీంకి కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. శివ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ఆడాడు. శివ బౌలింగ్ రుతు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రుతు వరుసగా 7 సిక్సులు బాది సంచలనంగా మారాడు.
సింగిల్ ఓవర్‌లో 43 పరుగులు తీసిన రుతు అప్పటివరకు ఈ రికార్డును సాధించి ఉన్న ఎల్టన్ చిగుంబుర రికార్డును బద్దలుకొట్టాడు. అలా తన బౌలింగ్‌కి రుతు వరుసగా సిక్సులు బాదుతుండడంతో శివ తట్టుకోలేకపోయాడు. బౌలింగ్ వేస్తూనే క్రికెట్ వదిలేయాలని అనుకున్నాడట. మానసికంగా బాధపడుతుంటే స్నేహితులు కాల్ చేసి మరీ ఇవన్నీ మామూలే అని నచ్చజెప్పాడని.. ఒకరకంగా తన కెరీర్ ఎదగకపోవడానికి కారణం రుతునే అని అంటున్నాడు శివ.