Paris Olympics: క్రూర‌మైన ట్విస్ట్‌లు… ఆవిరైన క‌ల‌లు

shattered dreams at Paris Olympics

Paris Olympics:  ఆశ‌లు ఆవిర‌య్యాయి.. క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి.. క‌నీసం ర‌జ‌తంతోనైనా స‌రిపెట్టుకుందాం అనుకుంటున్న త‌రుణంలో CAS షాకింగ్ తీర్పునిచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైన‌ల్స్‌కు చేరిన మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్‌.. ఫైన‌ల్స్ నుంచి డిస్‌క్వాలిఫై అయ్యింది. ఇందుకు కార‌ణం ఆమె ఉండాల్సిన బ‌రువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉండ‌ట‌మే. పోనీ సెమీ ఫైన‌ల్స్ వ‌ర‌కు స‌రైన బ‌రువులోనే ఉన్నాను క‌దా.. క‌నీసం ర‌జ‌తం ఇవ్వండి అని అప్పీల్ చేయ‌గా.. విచార‌ణ క‌మిటీ అయిన CAS అదేమీ కుద‌ర‌దు అని తేల్చి చెప్పేసింది. దాంతో వినేష్ ఖాళీ చేతుల‌తో ఇండియాలో అడుగుపెట్ట‌నుంది.  వినేష్ విష‌యంలోనే కాదు ఇలా చాలా మంది అంత‌ర్జాతీయ అథ్లెట్ల విష‌యంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు జ‌రిగి ప‌సిడి గెల‌వాల‌న్న వారి క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలిపోయిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. వారెవ‌రంటే..

అమెరికాకు చెందిన జోర్డాన్ చైల్స్ అనే జిమ్నాస్ట్ చివ‌రి నిమిషంలో త‌డ‌బ‌డి ఐదో స్థానానికి ప‌రిమితం అయ్యింది.దాంతో చైల్స్ కోచ్ ఆమెకు మూడో స్థానం క‌ల్పించి ర‌జతం ఇవ్వాల‌ని అప్పీల్ చేసింది. దాంతో చైల్స్‌కి ర‌జ‌తం వ‌చ్చింది. కానీ రొమేనియ‌న్ ఫెడ‌రేష‌న్ వారు దీనిని ఖండిస్తూ.. అప్పీల్ నాలుగు క్ష‌ణాలు ఆల‌స్యంగా చేసారంటూ CASను ఆశ్ర‌యించారు. CAS ఈ కేసును ఒక్క రోజులో ప‌రిశీలించి ఆ ర‌జ‌తం వెన‌క్కి ఇచ్చేయాల‌ని ఆదేశించింది. చైల్స్‌ను ఐదో స్థానానికే ప‌రిమితం చేసింది.

జ‌మైకాకు చెందిన స్ప్రింట‌ర్ షెల్లీ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఆమెకు ఆల్రెడీ మూడుసార్లు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింది. సెమీ ఫైన‌ల్స్‌లో 100 మీట‌ర్ల ప‌రుగు నుంచి ఆమె గాయం కార‌ణంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. జస్ట్ వార్మ‌ప్స్ చేస్తున్న స‌మ‌యంలో షెల్లీకి స్వ‌ల్ప గాయం అయ్యింది. దాంతో ఆమె ఈసారి మెడ‌ల్ సాధించ‌లేక‌పోయారు.

అమెరికాకు చెందిన మ‌రో స్ప్రింట‌ర్ నోవా లైల్స్ 200 మీట‌ర్స్ ఫైన‌ల్ రౌండ్‌కి ముందు కోవిడ్ బారిన ప‌డ‌టంతో మూడో స్థానానికే ప‌రిమితం అయ్యాడు. 200 మీట‌ర్ల ఫైన‌ల్స్‌లో పాల్గొని ఉసేన్ బోల్ట్ రికార్డును తిర‌గ‌రాయాల‌నుకున్నాడు కానీ విధి వింత నాట‌కం ఆడింది.

స్పెయిన్‌కి చెందిన ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మోకాలి గాయం నుంచి కోలుకుని మ‌రీ మొన్న జ‌రిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో మ‌ళ్లీ మోకాలికి గాయం కావ‌డంతో ఫైన‌ల్స్‌కి వెళ్ల‌కుండా విత్‌డ్రా చేసుకుంది.

అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్, సునీ లీ అనే బ్యాలెన్స్ బీమ్ అథ్లెట్లు ఫైన‌ల్స్‌లో చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. బైల్స్ కింద‌ప‌డిపోగా.. లీ శ‌రీరం స్వ‌ల్పంగా షేక్ అవ్వ‌డంతో అత‌ను ప‌డిపోయింది. అలా ఏ ఒక్కరికి కూడా మెడ‌ల్ రాలేదు. 2000 నాటి నుంచి జిమ్నాస్టిక్స్‌లో ఏ ఒక్క అమెరిక‌న్‌కు మెడ‌ల్ రాక‌పోవ‌డం ఇదే తొలిసారి.