Shane Watson: పుజారా లేకపోతే పోయేదేం లేదు
Shane Watson: నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. గత రెండు ఆస్ట్రేలియా సిరీస్‌లలో చెతేశ్వర్ పుజారా తన దైన ప్రదర్శనను ఇచ్చాడు. అయితే ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా ఆడటం లేదు. నెంబర్ 3 స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని కానీ యశస్వీ జైస్వాల్‌ని కానీ ఎంపిక చేసే అవకాశం ఉంది. దీని వల్ల ఆస్ట్రేలియన్ బౌలర్లపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్ పుజారాపై కీలక వ్యాఖ్యలు చేసారు. పుజారా లేనంత మాత్రాన టీమిండియాకు పెద్దగా ఒరిగేది ఏమీ ఏమీ లేదని అన్నారు.
యశస్వీ జైస్వాల్ తప్పులు చేయకుండా బాగా ఆడగలిగితే ఈ సిరీస్‌లో మంచి విజయం సాధించే అవకాశం ఉందని వాట్సన్ అభిప్రాయపడ్డారు. ఈసారి ఆస్ట్రేలియా భారత్ విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 33 ఏళ్లలో తొలిసారి ఈ సిరీస్ 5 టెస్ట్ సిరీస్‌గా జరగబోతోంది.