Shahid Afridi: కోహ్లీ పాకిస్థాన్‌కి వస్తే ఇండియాకి వచ్చినట్లే..!
Shahid Afridi: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్‌కు రావాలని పిలుపునిచ్చాడు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌కు వస్తే అతనికి ఇండియాలో ఎంత ప్రేమ లభిస్తుందో అంతే ప్రేమ పాకిస్థాన్‌లోనూ లభిస్తుందని తెలిపాడు. భారత్ పాకిస్థాన్ మధ్య ఎన్ని రాజకీయ వైరాలు ఉన్నా క్రీడలను రాజకీయాలతో కలిపి చూడొద్దని అభిప్రాయపడ్డాడు. పాకిస్థానీ ఆటగాళ్లు భారత్‌కు వెళ్తే వారిని భారతీయులు ఎంతో గౌరవించారని.. అదే విధంగా భారతీయులు పాకిస్థాన్‌కు వస్తే అంతే గౌరవ స్థాయిలో ఆతిథ్యం ఉంటుందని అఫ్రిది తెలిపాడు.
తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని అతను T20Iల నుంచి రిటైర్ అవ్వడం బాధ కలిగించిందని తెలిపాడు. సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత అంతటి స్థాయిలో ఎదిగే ఏకైక క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం వహిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లను పాకిస్థాన్‌కు పంపించే సమస్యే లేదని అందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే పంపుతామని బీసీసీఐ వెల్లడించింది.