PAK vs ENG: జింబూ.. బాబర్‌ను ఎగతాళి చేసిన షహీన్
PAK vs ENG: సాధారణంగా క్రికెట్ రంగంలో ఒక టీం ఆటగాళ్లు మరో టీం ఆటగాళ్లను తిట్టుకుంటూ ఉంటారు. దీనిని స్లెడ్జింగ్ అంటారు. కానీ ఒకే టీంకి చెందిన ఆటగాడు మరో ఆటగాడిని మైదానంలోనే అవమానిస్తే? ఇదే పాకిస్థాన్ క్రికెట్ టీంలో జరిగింది. టెస్ట్ క్రికెట్ విషయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం చాలా కఠిన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. డిసెంబర్ 2022 తర్వాత నుంచి బాబర్ అసలు సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ బాబర్ రెండు ఇన్సింగ్స్‌లో 30, 5 పరుగులు మాత్రమే చేసాడు. పిచ్ పాకిస్థాన్‌కి అనుకూలంగా ఉన్నప్పటికీ బాబర్ సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నాడన్న ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి.
కూన టీం అయిన జింబాబ్వేతో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రమే బాబర్ పెద్ద స్కోర్లు చేయగలుగుతున్నాడు. దాంతో పాక్ ఫ్యాన్స్ బాబర్‌ను జింబూ జింబూ అని వెక్కిరిస్తున్నారు. ఫ్యాన్స్ వెక్కిరిస్తే వెక్కిరించారు. కానీ సొంత టీంలోని ఆటగాడు కూడా వెక్కిరిస్తే ఆ బాధ అనుభవించేవాడికే తెలుస్తుంది. ఇంతకీ ఇప్పుడు బాబర్‌ని ఎవరు వెక్కిరించారంటే.. షహీన్ అఫ్రిది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా షహీన్ చెయ్యి అడ్డుపెట్టుకుని బాబర్‌ను జింబూ జింబూ అని వెక్కిరించడం కెమెరాల్లో రికార్డు అయ్యింది. కొంతకాలంగా షహీన్‌కు బాబర్‌కు మధ్య విరోధం ఉంది. T20 ప్రపంచ కప్ తర్వాత షహీన్‌ను బాబర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని ఇటీవల మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో వీరిద్దరికీ పడటం లేదు. ఈ నేపథ్యంలో షహీన్ మైదానంలోనే సొంత టీం ఆటగాడిని వెక్కిరించడం వైరల్‌గా మారింది.