Saurav Ganguly: విరాట్, రోహిత్ శ‌ర్మ‌ల భార్య‌లు టెన్ష‌న్ ప‌డి ఇత‌రుల‌ను టెన్ష‌న్ పెడుతుంటారు

saurav ganguly says virat and rohit sharma's wives put unnecessary pressure on themselves

 

Saurav Ganguly: టీమిండియా క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల భార్య‌ను రితికా స‌జ్దే, అనుష్క శ‌ర్మ‌ల‌పై కామెంట్స్ చేసారు మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ. అమెరికా, వెస్ట్ ఇండీస్‌లో జ‌ర‌గ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ జూన్ 5 నుంచి మొద‌లుకాబోతోంది. పాకిస్థాన్, ఐర్లాండ్, కెన‌డా, అమెరికా టీంల‌తో పాటు ఇండియా గ్రూప్ ఏలో ఆడ‌బోతోంది.

ఈ నేప‌థ్యంలో టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు గంగూలీ ఒక కీల‌క‌మైన స‌ల‌హా ఇచ్చారు. మ్యాచ్ స‌మ‌యంలో అన‌వ‌స‌రంగా టెన్ష‌న్ ప‌డ‌కూడ‌ద‌ని.. దాని వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అన్నారు. పెద్ద మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో టీమిండియా క్రికెట‌ర్లు, ఫ్యాన్స్ ఒత్తిడికి లోనై తెగ టెన్ష‌న్ ప‌డిపోతుంటార‌ని అన్నారు. అనుష్క శ‌ర్మ‌, రితికా సజ్దేలు గ్యాల‌రీలో కూర్చుని టెన్ష‌న్ ప‌డుతూ చేతి వేళ్లు చూపిస్తూ తెగ గాబ‌రా ప‌డిపోతుంటార‌ని.. వారిని చూడ‌గానే ఫ్యాన్స్ కూడా కంగారుప‌డ‌తార‌ని.. ఇదంతా టీమిండియా క్రికెట‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపారు. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్‌తో వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌బోతోంది. న్యూయార్క్‌లోని నాస్సౌ కౌంటీ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రగ‌బోతోంది.