Krishnappa Gowtham: గోయంకా రాహుల్‌ని తిట్ట‌డంలో త‌ప్పు లేదు

sanjiv goenka did a right thing scolding kl rahul

Krishnappa Gowtham: ఈ ఏడాది IPL సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ ఎంతో అవ‌మాన‌ప‌డ్డాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ ఓడిపోవ‌డంతో మైదానంలోనే ల‌క్ష‌లాది మంది చూస్తుండ‌గా సూప‌ర్ జైంట్స్ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై నోరుపారేసుకున్నారు. ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై టీంలోని క్రికెట‌ర్ కృష్ణ‌ప్ప గౌత‌మ్ స్పందించారు. గోయెంకా రాహుల్‌ని తిట్టడంలో త‌ప్పు లేద‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. సూప‌ర్ జైంట్స్ కోసం గోయెంకా ఎంతో ఖ‌ర్చు పెట్టార‌ని.. అలాంటిది క‌ళ్ల ముందే టీం చిత్తుగా ఓడిపోతుంటే ఆయ‌న తిట్ట‌డంలో అర్థం ఉంద‌ని అన్నారు. రాహుల్‌ని త‌ప్పు ఉంది కాబ‌ట్టే ఆయ‌న తిడుతుంటే ఏమీ అన‌లేక చూస్తుండిపోయాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

2025 ఐపీఎల్‌లో భాగంగా ఎక్క‌డ త‌న‌ను తీసేస్తారో అని రాహుల్ ముందుగానే క‌ల‌క‌త్తా వెళ్లి మ‌రీ గోయెంకాను క‌లిసారు. త‌న‌ను జైంట్స్ కెప్టెన్‌గా రీటైన్ చేయాల‌ని కోరాడు. దీనిపై గోయెంకా మీడియా ద్వారా స్పందిస్తూ… రాహుల్ టీంకి కీల‌క ఆట‌గాడు అని అన్నారే త‌ప్ప కెప్టెన్‌గా కొన‌సాగుతాడా లేదా అని మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇక టీం మెంటార్‌గా జ‌హీర్ ఖాన్‌ను నియ‌మించారు.