Sanjiv Goenka: రోహిత్ శర్మను వదులుతారా?
Sanjiv Goenka: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తప్పించాక రోహిత్ శర్మ ఇంకా ఆ టీంలో కొనసాగుతాడా లేదా అనే చర్చ మొదలైంది. ఒకవేళ బయటికి వచ్చేస్తే రోహిత్‌ను రూ.50 కోట్లు పెట్టి తీసుకోవడానికైనా అన్ని టీంలు సిద్ధంగా ఉన్నాయి. అయితే రోహిత్ శర్మను లఖ్‌నౌ సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ విషయంపై సంజీవ్ స్పందించారు. “” అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదులుతుందా? వదిలితే రోహిత్ వేలానికి వస్తాడా? ఒకవేళ వచ్చినా నేను రూ.50 కోట్లు అతనిపైనే పెడితే ఇక మిగతా ఆటగాళ్లకు ఏం పెట్టగలను? ఇవన్నీ రూమర్స్. బెస్ట్ కెప్టెన్, బెస్ట్ ప్లేయర్ కావాలని అందరూ కోరుకుంటారు. నా టీంలో ఎలాంటి వారు ఉన్నారో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను “” అని వెల్లడించారు.
మరోపక్క ఎక్కడ తనను కెప్టెన్సీ నుంచి తొలగించేస్తారో అని కేఎల్ రాహుల్ ఆల్రెడీ గోయెంకాను కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో గోయెంకా మైదానంలోనే లక్షలాది మంది చూస్తుండగానే రాహుల్‌పై నోరుపారేసుకున్నాడు. దానిని అవమానంగా భావించిన రాహుల్ టీంను వదిలేస్తాడని అంతా అనుకున్నారు. కానీ రాహులే స్వయంగా గోయెంకా వద్దకు వెళ్లి తనను రీటైన్ చేయాలని అడగడం గమనార్హం.