Sanjay Manjrekar: కోహ్లీ ఏం సాధించాడ‌ని ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు?

Sanjay Manjrekar says virat kohli does not deserve player of the match award

Sanjay Manjrekar: విరాట్ కోహ్లీ ఏం సాధించాడ‌ని అత‌నికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్. మొన్న జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాకు 30 బంతుల్లో 30 ప‌రుగులు కావాల్సి ఉంద‌ని.. అతిక‌ష్టం మీద 7 ప‌రుగుల‌తో టీమిండియా గెలిచింద‌ని అన్నారు. టీమిండియా గెలవ‌డానికి కార‌ణం బౌల‌ర్లు హార్దిక్ పాండ్య‌, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా మాత్ర‌మే అని సంజ‌య్ అభిప్రాయ‌ప‌డ్డారు. కోహ్లీ ఇన్సింగ్స్ టీంని రిస్క్‌లో పెట్టాయ‌ని.. అత‌నికి కాకుండా బౌల‌ర్ల‌లో ఎవ‌రికైనా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింద‌ని అన్నారు. మాజీ జింబాబ్వే క్రికెట‌ర్ ఆండీ ఫ్ల‌వ‌ర్ కూడా ఇదే విష‌యంపై స్పందించాడు. టీమిండియా క‌ప్ గెలిచింది కాబ‌ట్టి స‌రిపోయింది కానీ అదే ఓడిపోయి ఉంటే విరాట్ కోహ్లీని బూతులు తిట్టుకునేవార‌ని తెలిపారు.