Sania Mirza: షమితో పెళ్లి.. స్పందించిన సానియా తండ్రి
Sania Mirza: టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో.. క్రికెటర్ మహ్మద్ షమి పెళ్లి జరగనుందని వస్తున్న వదంతులపై ఎట్టకేలకు సానియా తండ్రి ఇమ్రాన్ స్పందించారు. అసలు సానియా షమి ఎప్పుడూ కలిసింది కూడా లేదని అలాంటిది వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని ఎలా అనుకుంటారని తెలిపారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో సమయం గడుపుతోందని.. ఎలాంటి పెళ్లి ప్రతిపాదనలు లేవని వెల్లడించారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్‌ను సానియా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని నెలల క్రితం షోయెబ్ సానియా విడాకులు తీసుకున్నారు. ఆ వెంటనే షోయబ్ సనా జావేద్ అనే నటిని వివాహం చేసుకున్నారు.