Team India Coach: గంభీర్‌కీ తప్పని సాలరీ సమస్య.. !
Team India Coach: ఏదన్నా కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు సాలరీ నెగోషియేషన్ విషయంలో కాస్త తర్జన భర్జన పడుతుంటుంది. హెచ్ఆర్ ఒక రేటు చెప్తే ఉద్యోగి మరో రేటు చెప్తాడు. దాంతో అది ఫిక్స్ చేయాలా వద్దా అనే కొంతకాలం పాటు చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ సమస్య క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి కూడా తప్పలేదు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాల్సి ఉంది. అంతా సిద్ధమైపోయింది ఇక ప్రకటన చేసేస్తారు అనుకుంటున్న సమయంలో గంభీర్ సాలరీ విషయంలో BCCI కాస్త వెనకడుగు వేస్తోంది. ద్రావిడ్ కంటే ఎక్కువ సాలరీ కావాలని గంభీర్ అడిగాడట. దాంతో బీసీసీఐ ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు వేరే కోచ్‌ను నియమించనున్నట్లు బీసీసీఐ జనరల్ సెక్రటరీ జై షా తెలిపారు.