Saina Nehwal: కనీసం ఒలింపిక్స్‌కి క్వాలిఫై అవ్వగలరా?
Saina Nehwal: సైనా నెహ్వాల్.. ఒలింపిక్స్‌లో పథకం సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా పేరుగాంచి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2012లో నెహ్వాల్ రజత పతకం సాధించినప్పుడు ఆమెకు ఆ పతకాన్ని ఎవరో గిఫ్ట్‌గా ఇచ్చారని.. ఆమె సాధించలేదని కొందరు కామెంట్స్ చేసారట. ఈ విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్ షోలో సైనా భర్త పారుపల్లి కశ్యప్ వెల్లడించాడు. ఈ ట్రోల్స్‌పై సైనా స్పందిస్తూ.. “” నాపై కామెంట్స్ చేసినవారు కనీసం ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యే అర్హత అయినా ఉందా? మీరు పతకం సాధించాల్సిన అవసరం లేదు. కనీసం క్వాలిఫై అయ్యి అప్పుడు నాపై కామెంట్స్ చేయండి “” అని మండిపడ్డారు.
ఇంతకీ సైనాపై ఇలాంటి ట్రోల్స్ ఎందుకు వచ్చాయంటే.. మొన్న జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ కేటగిరీలో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్స్ వరకు వెళ్లిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర లిఖించిన వినేష్‌కు ఫైనల్స్‌లో షాక్ ఎదురైంది. ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధిక బరువు ఉందని ఫైనల్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేసారు. దీనిపై సైనా స్పందిస్తూ.. ఒలింపిక్స్ రూల్స్ ఎలా ఉంటాయో వినేష్‌కు తెలుసని.. అలాంటప్పుడు బరువును అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని అన్నారు. దాంతో సైనాకు పతకం ఎవరో కానుక ఇస్తే వచ్చినట్లుందని.. ఆమెకు పతకం సాధించేంత సీన్ లేదని ట్రోల్స్ పేలాయి.
ప్రస్తుతం సైనా షటిల్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనడం లేదు. ఆమె కొన్ని నెలలుగా అర్థ్‌రైటిస్‌తో బాధపడుతోంది. దాంతో ఆమె డిసెంబర్‌లో ఆటకు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది.