రుతుని కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌నున్న‌ CSK?

ruturaj gaikwad to lose captaincy after ipl

Ruturaj Gaikwad: ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చోటు ద‌క్కించుకున్నాయి. ముంబై ఇండియ‌న్స్, పంజాబ్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఔట్ అయ్యాయి. ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ కూడా ఆశ‌లు వ‌దిలేసుకున్నాయి. ఫైన‌ల్ ప్లే ఆఫ్ మ్యాచ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

శ‌నివారం చిన్న‌స్వామి స్టేడియంలో ఎవ‌రు ఫైన‌ల్ ప్లే ఆఫ్స్‌కి చేర‌తారో తెలిసిపోతుంది. అయితే.. ఈసారి చెన్నై ప్లే ఆఫ్స్‌కి వెళ్ల‌లేక‌పోతే మాత్రం చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను తొల‌గించాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ వెల్ల‌డించారు. 2022లో ర‌వీంద్ర జ‌డేజా విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని ప‌ఠాన్ గుర్తు చేసారు. జడేజా కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌రిగ్గా ఆడ‌లేక‌పోయింద‌ని ఆయ‌న్ను తీసేసారు. ఈ ఆట కూడా ధోనీ ఐపీఎల్ కెరీర్‌లో చివ‌రి ఆట కావ‌చ్చ‌ని కూడా పఠాన్ అన్నారు.