Rohit Sharma: నువ్వెప్పుడు బ్యాటింగ్ చేసావ్ బాబూ… కుల్దీప్ పరువు తీసేసిన రోహిత్
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలర్ కుల్దీప్ యాదవ్ పరువు తీసేసాడు. వీరిద్దరికీ సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. 2023 ఓడీఐ మ్యాచ్ సమయంలో కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. తన మ్యాజికల్ బౌలింగ్‌తో 49 వికెట్లు తీసాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ నుంచి క్యాప్ కూడా అందుకున్నాడు. అయితే మీడియాతో కుల్దీప్ రోహిత్ మాట్లాడుతున్నప్పుడు.. బ్యాటింగ్, బౌలింగ్‌ని నేను బాగా ఎంజాయ్ చేసాను అన్నాడు.
దాంతో పక్కనే ఉన్న రోహిత్.. నేను కెప్టెన్‌ని. నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. దేని గురించి మాట్లాడుతున్నావ్? అని అడిగి పాపం కుల్దీప్ పరువు తీసేసాడు. ఆ తర్వాత కుల్దీప్ కవర్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్‌లో నా బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. దాంతో రోహిత్ శర్మ స్పందిస్తూ.. నీకు ఇచ్చిన క్యాప్ ఓడీఐ మ్యాచ్‌కి సంబంధించినది. ఓడీఐ గురించి మాట్లాడు అన్నాడు. దాంతో అక్కడున్నవారంతా నవ్వుకోవడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.