Rohit Sharma: ఆ ముగ్గురి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు
Rohit Sharma: బంగ్లాదేశ్ సిరీస్ దగ్గరపడుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ టీం స్ట్రాటెజీలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కి కేఎల్ రాహుల్ ఎంతో కీలకం అని చెప్పిన రోహిత్.. ముగ్గురు యువ క్రికెటర్ల గురించి అడగ్గా.. వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరంటే.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్. ఈ ముగ్గురు క్రికెటర్లు టెస్ట్, ODI, T20 సిరీస్‌లలో టాప్ స్థాయికి వెళ్తారని వారి గురించి ఎవ్వరూ మాట్లాడాల్సిన పని లేదని అన్నారు.
ఈ ముగ్గురికీ మరింత ట్రైనింగ్, మెంటరింగ్ చేస్తే అన్ని ఫార్మాట్లలో తమ సత్తా చాటుకుంటారని తెలిపారు. ఈ ముగ్గురూ ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా క్లియర్ మైండ్ సెట్‌తో ఉంటే సక్సెస్ వారి వద్దకే వస్తుందని అభిప్రాయపడ్డారు. గురువారం చెన్నైలో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రోహిత్ సేన క్లియర్ గోల్స్ పెట్టుకుంది. టీమిండియా తరఫు నుంచి విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, జైస్వాల్, జురేల్, సర్ఫరాజ్ ఖాన్‌లు ఆడనున్నారు.