Rohit Sharma: సలహాలివ్వండి.. అంతిమ నిర్ణయం నాదే
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక విన్నింగ్ పర్సెంటేజ్ కలిగిన కెప్టెన్. అంటే అతని కెప్టెన్సీలో ఓటముల కంటే గెలుపులే ఎక్కువ. తాను ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణం అనుభవంతో తెలుసుకున్న మెలకువలే అంటున్నాడు రోహిత్. అనుభవం వల్ల ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ముందే తెలిసిపోతోందని అదే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బంగ్లాను చిత్తుగా ఓడించింది. అయితే.. రోహిత్ కెప్టెన్ అయినప్పటికీ తన సహ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్ల నుంచి సలహాలు తీసుకుంటానని అన్నాడు. సలహాలు అందరూ ఇవ్వచ్చు కానీ చివరి నిర్ణయం మాత్రం తనదే అని చెప్తున్నాడు. తనకు ఫీల్డ్‌లో కోపం వచ్చినా ఆ కోపం తన బాడీ లాంగ్వేజ్‌లో కాకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో చూపిస్తానని తెలిపాడు.