Rohit Sharma: బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు.. మూతిప‌గిలేలా స‌మాధాన‌మిచ్చిన రోహిత్

Rohit Sharma slams Inzamam ul Haq Allegation of Arshdeep Singh Ball Tampering

Rohit Sharma:  ఇండియా ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న సెమీ ఫైన‌ల్ మ్యాచ్ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ రోహ‌త్ శ‌ర్మ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇన్జ‌మామ్ ఉల్ హ‌క్‌.. అర్ష్‌దీప్ సింగ్ బాల్ టాంపరింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని చేసిన ఆరోప‌ణ‌ల‌పై రోహిత్ స్పందించారు. మీడియా నుంచి ఈ ప్ర‌శ్న విన‌గానే రోహిత్‌కు ఒళ్లుమండిపోయింది. పిచ్ చాలా డ్రైగా హాట్‌గా ఉంటుంద‌ని.. అలాంట‌ప్పుడు బాల్ వేస్తే రివ‌ర్స్ స్వింగ్ అవ్వ‌కుండా ఇంకేమవుతుంద‌ని మూతిప‌గిలేలా స‌మాధానం ఇచ్చారు. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు వేరుగా ఉంటాయ‌ని తెలిపారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసే ముందు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే బాగుంటుంద‌ని రోహిత్ మండిపడ్డారు.