Rohit Sharma: రిటైర్మెంట్ ప్రకటించాలనుకోలేదు కానీ..
Rohit Sharma: టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనుకోలేదు కానీ తప్పలేదని అన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడారు. తనకు ఏమాత్రం రిటైర్మెంట్ ప్రకటించాలని లేదు కానీ.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే రిటైర్ అవ్వడం బెటర్ అనిపిస్తోందని అన్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూసిన కప్ గెలిచాక రిటైర్ అవ్వడం కంటే ఆనందం ఇంకేముంటుంది అన్నారు. అయితే తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఎదురైన పరిస్థితులు ఏంటో మాత్రం రోహిత్ వెల్లడించలేదు. టీ20ల నుంచి రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.