Rohit Sharma: 3 గంటల మ్యాచ్ మా భవిష్యత్తుని డిసైడ్ చేసేస్తదా?
Rohit Sharma: నిన్న బెంగళూరులో న్యూజిల్యాండ్ చేతిలో మనోళ్లు ఓడిపోయారు. 1988 తర్వాత టీమిండియా సొంత గడ్డపై కివీస్‌తో మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. 2012 తర్వాత రెండు సార్లు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇండియా ఓడిపోవడం కూడా నిన్నే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులే ఇండియా ఆలౌట్ అయిపోయింది. ఇంత తక్కువ రన్స్‌తో ఎప్పుడూ ఓడిపోయింది కూడా లేదు. రెండో ఇన్సింగ్స్‌లో 462 పరుగులు తీసినప్పటికీ తొలి ఇన్సింగ్స్ పెర్ఫామెన్స్ నుంచి కోలుకోలేకపోయింది.
ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఎవ్వరూ బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదని.. ఆఫ్ట్రాల్ మూడు గంటల మ్యాచ్ టీమిండియా భవిష్యత్తుని డిసైడ్ చేసేస్తుందా అని అన్నారు. కేవలం మ్యాచ్‌లోని తొలి గంటల్లో మాత్రమే టీమిండియా పెర్ఫామెన్స్ బాలేదని ఆ తర్వాత ఎలా పుంజుకుందో కూడా చూడాలని అన్నారు. అక్టోబర్ 24న పుణెలో జరగబోయే రెండో టెస్ట్‌పై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. ఓటములు ఎదురైనా స్ట్రాంగ్‌గా ఉండటమే తనకు తెలుసని.. తర్వాతి టెస్ట్‌లో ఎలా పుంజుకోవాలో టీంకి బాగా తెలుసని అన్నారు.