Rohit Sharma: T20 వరల్డ్ కప్ విజయం ఆ ముగ్గురి వల్లే సాధ్యమైంది
Rohit Sharma: T20 మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తాను వరల్డ్ కప్ సాధించడం వెనక మూడు స్తంభాలు ఉన్నాయని అన్నారు. వారే రాహుల్ ద్రావిడ్, అజిత్ అగార్కర్, జై షా. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి కారణం ఈ ముగ్గురే అని వెల్లడించారు. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి గురవకుండా వారికి స్పేస్ ఇచ్చింది ఆ ముగ్గురే అని వారే లేకపోతే తన సారథ్యంలో ప్రపంచ కప్ వచ్చేది కాదని అన్నారు. ఈ ఏడాది జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి 13 ఏళ్లుగా లేని ప్రపంచ కప్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టీ20లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు.