IND vs BAN: మ‌మ్మ‌ల్ని ఓడిస్తామ‌ని క‌ల‌లు కంటున్నారు

IND vs BAN: త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న బంగ్లాదేశ్ టెస్ట సిరీస్‌ల నేప‌థ్యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అన్ని టీంలు టీమిండియానే ఓడించాల‌ని అనుకుంటాయ‌ని అన్నారు. ఇండియాపై గెలిస్తే ఇత‌ర టీమ్స్ ఆనందానికి అవ‌ధులుండ‌వ‌ని.. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌మ ప్లాన్లు త‌మ‌కు ఉంటాయ‌ని రోహిత్ అన్నారు. ప్రత్య‌ర్ధి టీమ్స్ త‌మ గురించి ఏం మాట్లాడుకున్నా తాము అస్స‌లు ప‌ట్టించుకోమ‌ని తెలిపారు. గ‌తంలో ఇంగ్లాండ్ కూడా ఇండియాకి వ‌చ్చిన‌ప్పుడు ప్రెస్ మీట్ల‌లో త‌మ‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి చాలా మాట‌లు మాట్లాడింద‌ని.. కానీ తమ‌ని మాత్రం అవేమీ డిస్ట‌ర్బ్ చేయ‌లేక‌పోయాన‌ని వెల్ల‌డించారు.

రాహుల్‌పై కాన్ఫిడెన్స్ ఉంది

కేఎల్ రాహుల్‌పై త‌న‌కు కాన్ఫిడెన్స్ ఉంద‌ని ఈ సంద‌ర్భంగా రోహిత్ తెలిపారు. ద‌క్షిణాఫ్రికాపై రాహుల్ చేసిన సెంచ‌రీని ఇంకా తాను మ‌ర్చిపోలేక‌పోతున్నాన‌ని అన్నారు. రాహుల్ అన్ని మ్యాచ్‌ల‌లో ఆడాల‌ని చెప్పామ‌ని.. ఆడాలా వ‌ద్దా అనేది త‌న నిర్ణ‌య‌మే అని అన్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ రాబోతున్న నేప‌థ్యంలో రాహుల్ రెడీగా ఉన్నాడ‌నే ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు.