Ind vs Aus: ఒకే రోజు 3 రికార్డులు.. హిట్‌మ్యాన్ విశ్వ‌రూపం

rohit sharma 3 records during Ind vs Aus match

Ind vs Aus:  నిన్న జ‌రిగిన ఇండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో మ‌నోళ్లు విశ్వ‌రూపం చూపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చెల‌రేగిపోయాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియాను నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో మ‌ట్టిక‌రిపించి ప‌గ తీర్చుకున్నారు. ఇదే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు రికార్డుల‌ను క్రియేట్ చేసాడు.

T20I క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు తీసిన క్రికెట‌ర్‌గా తొలి రికార్డు సాధించాడు. ఇప్పటివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ T20Iలో చేసిన ప‌రుగులు 4165. ఈ రికార్డుతో పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (4145), టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ (4103) ల‌ను హిట్ మ్యాన్ దాటేసాడు. T20 అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 200 సిక్సులు బాదిన ఏకైక ప్లేయ‌ర్‌గా రెండో రికార్డు సాధించాడు. ఇక మూడో రికార్డు ఏంటంటే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌త్య‌ర్ధి టీంపై అత్య‌ధిక సిక్సులు బాదిన క్రికెట‌ర్‌గా నిలిచాడు.