Rishabh Pant: రోజు రోజుకీ దిగ‌జారిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు

Rishabh Pant slams rumours

Rishabh Pant: త‌న‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నవారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు రిష‌భ్ పంత్. ఐపీఎల్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో పంత్ రాయ‌ల్ ఛాలెంజ్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకోసం బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సీతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడ‌ని.. కానీ పంత్ టీంలో రాజ‌కీయాలు చేస్తుంటాడ‌న్న కార‌ణంతో కోహ్లీ టీంలో జాయిన్ చేసుకోవ‌ద్ద‌ని ఫాఫ్‌తో అన్న‌ట్లు ఓ క్రికెట్ ఫ్యాన్ ట్వీట్ చేసాడు. దీనిపై వెంట‌నే పంత్ స్పందించాడు. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయ‌ని.. ఇంకెంత నీచానికి దిగ‌జార‌తారు అని ప్ర‌శ్నించాడు. ఈ త‌ప్పుడు ప్ర‌చారం ఇక్క‌డితో ఆగ‌ద‌ని త‌న‌కూ తెలుస‌ని.. కానీ త‌న నుంచి క్లారిటీ ఇవ్వాలి కాబ‌ట్టి ఇస్తున్నాన‌ని అన్నాడు.