IND vs AUS: పాండ్యను గాయపరిచిన పంత్.. రోహిత్ ఆగ్రహం
IND vs AUS: మొన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. క్రికెటర్ రిషబ్ పంత్ బాల్‌తో వికెట్‌ని కొట్టేందుకు ప్రయత్నించగా.. ఆ బాల్ కాస్తా హార్దిక్ పాండ్య చేతికి తాకింది. దాంతో పాండ్యకు ఒళ్లుమండింది. ఇదంతా చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ వైపు కోపంగా చూడటం వైరల్‌గా మారింది.
ఇప్పుడు జరుగుతున్న వైట్ బాల్ క్రికెట్‌కు ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్య టీంలో ఉండటం ఎంతో కీలకం. 2021లో నడుముకి తగిలిన గాయం కారణంగా T20 వరల్డ్ కప్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. దాంతో భారత్‌కు అదనపు బౌలర్ కొరవడ్డాడు. 2023లో ODI వరల్డ్ కప్ సమయంలో నాలుగు ఆటలు ఆడిన పాండ్యకు మళ్లీ గాయమైంది. దాంతో మళ్లీ బౌలింగ్‌కు దూరం అయ్యాడు. ఇక ఇలా కాకూడదని ఈసారి టీమిండియా నలుగురు బౌలర్లను నియమించింది. పాండ్య 8 వికెట్లు 116 పరుగులు తీసి టీమిండియాను సెమీ ఫైనల్స్ వైపు నడిపించాడు.
ఇలాంటి సమయంలో పంత్ పాండ్య చేతికి దాదాపుగా గాయపరచబోయాడు. అదే జరిగి ఉంటే మరోసారి పాండ్య టీమిండియాకు దూరం అయ్యేవాడు. దాంతో పాండ్య, రోహిత్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ విషయానికొస్తే రేపు (జూన్ 27) గుయానాలో టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో సెమీ ఫైనల్లో అఫ్ఘానిస్థాన్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది.