Rinku Singh: ఆలోచించడానికి ఏముంది.. నేనే సరిగ్గా ఆడలేదు
Rinku Singh: డొమెస్టిక్ క్రికెట్ లీగ్ అయిన దులీప్ ట్రోఫీలో రింకు సింగ్‌కి చోటు దక్కలేదు. IPL సీజన్ మొత్తంలో రింకూ తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసాడు. దాంతో దులీప్ ట్రోఫీకి ఎంపికవుతాడని అంతా అనుకున్నారు. కానీ రింకూ ఫ్యాన్స్‌కి ఈ విషయంలో షాక్ తగిలింది. దీని గురించి రింకూ స్పందించాడు.
“” ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నేను డొమెస్టిక్ సీజన్‌లో నేను సరిగ్గా ఆడలేదు. రంజి ట్రోఫీలోనూ సరిగ్గా ఆడలేదు. అందుకే నన్ను సెలెక్ట్ చేయలేదు. బహుశా తర్వాత మ్యాచ్‌ల్లో నన్ను తీసుకుంటారేమో “” అని రింకూ అన్నాడు. దులీప్ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్రా జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. సీనియర్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీచంద్రన్ అశ్విన్‌లకు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం మాత్రమే ఇచ్చారు.