RCB vs KKR: ఏ జట్టుకు గెలుపు అవకాశం?

RCB vs KKR: IPL-2024 సిరీస్‌లో భాగంగా ఈ రోజు (మార్చి 29) 10వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు IPLలో 32 సార్లు తలపడ్డాయి. అందులో కోల్‌కతా జట్టు 18 సార్లు, బెంగళూరు జట్టు 14 సార్లు విజయం సాధించాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు 53%, కోల్‌కతా జట్టుకు 47% విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు హోం టీమ్స్‌ గెలిచాయి. ఈరోజు RCBని మట్టికరిపించి ఆ రికార్డును మార్చాలని KKR భావిస్తోంది. అటు RCB సైతం బలంగానే ఉండటంతో రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది