ఉదయం 5 వరకు RCB పార్టీ.. క్రికెటర్ తండ్రి షాకింగ్ వ్యాఖ్యలు
CSK vs RCB: కొన్ని రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించేసినట్లు మైదనాంలో సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ తర్వాత ఆనవాయితీగా వస్తున్న షేక్ హ్యాండ్ ప్రక్రియను కూడా మర్చిపోయి మరీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. దాంతో సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏమీ చేయలేక షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూంలోకి బాధపడుతూ వెళ్లిపోయారు.
ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్ల తీరుపై సీనియర్ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే బెంగళూరు టీంకు చెందిన ఆటగాడి తండ్రి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. చెన్నైపై గెలిచిన ఆనందంలో మైదనాంలో సెలబ్రేషన్స్ చేసుకున్నా కూడా వారికి తనివి తీరలేదట. దాంతో ఉదయం 5 వరకు హోటల్‌లో పార్టీ చేసుకున్నారట. ఆరోజు చెన్నైని ఓటమికి కీలకమైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది బౌలర్ యష్ దాయళ్. ఇప్పుడు యష్ తండ్రే వారు పార్టీ చేసుకున్నారని మీడియా ముందు బయటపెట్టడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అలా పార్టీలు చేసుకుంటూ నిద్రపోకుండా ఉంటే ఎలా గెలుస్తారని గతంలో మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా బెంగళూరు టీం తీరుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.