Ravichandran Ashwin: కుంబ్లే రికార్డ్‌కు కొంచెం దూరంలో..!

Ravichandran Ashwin: రాంచీ (Ranchi) వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే ?

ఇటీవలే టెస్టు క్రికెట్​లో 500 వికెట్ల మైలురాయిని దాటిన టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ఈ ఘనతను అశ్విన్ సాధించాడు.

ఇంగ్లాండ్‌పై జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన రెండో బంతికి ఇంగ్లాండ్ ప్లేయర్​ బెయిర్‌ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్​ (23 మ్యాచ్‌ల్లో) సాధించాడు. అంతేకాకుండా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్​గానూ అశ్విన్ రికార్డుకెక్కాడు. అయితే ఈ జాబితాలో అశ్విన్​ కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్‌ అండర్సన్‌ టీమ్‌ఇండియాపై టెస్టుల్లో 139 వికెట్లు (35 మ్యాచ్‌ల్లో) తీసి టాప్​ పొజిషన్​లో ఉన్నాడు. (Ravichandran Ashwin)

ALSO READ: Ravichandran Ashwin: స్టార్‌ స్పిన్నర్‌ సరికొత్త రికార్డు..!

మరోవైపు టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు + 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా క్రికెట్​ హిస్టరీలో ఈ ఘనతను సాధించింన ఏడో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అయితే అతడి కంటే ముందు జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ రికార్డును చేజిక్కించుకున్నారు.

కుంబ్లే రికార్డ్‌కు కొంచెం దూరంలో

మరోవైపు స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన రెండో ఆటగాడిగా అశ్విన్‌ కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఈ జాబితాలో 350 వికెట్లతో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) (63 మ్యాచ్‌ల్లో) టాప్ పొజిషన్​లో ఉన్నారు. అయితే 349 వికెట్లతో (58 టెస్టుల్లో) ఉన్న అశ్విన్‌ ఈ మార్క్​ను దాటాలంటే అతడికి మరో రెండు వికెట్లు అవసరం ఉంది. ఇక టెస్టుల్లో అనిల్ కుంబ్లే 35 సార్లు ‘ఐదు వికెట్ల’ రికార్డును అందుకోగా, అశ్విన్‌ ఇప్పటి వరకు 34 సార్లు ఆ ఘనతను సాధించాడు. దీంతో త్వరలో ఈ రికార్డును కూడా అశ్విన్​ అందుకునే సూచనలు కనిపిస్తున్నాయని క్రికెట్​ విశ్లేషకుల మాట.

ALSO READ: Ravichandran Ashwin: అశ్విన్ అనూహ్య నిర్ణ‌యం వెనకున్న కార‌ణం ఏంటి?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. జోరూట్ (16), బెన్‌ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు. జాక్‌క్రాలీ (42) తృటిలో అర్ధ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. బెయిర్ స్టో (38) రాణించాడు. బెన్ డ‌కెట్ (11), ఒలి పోప్ (0), బెన్‌స్టోక్స్ (3) లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అరంగ్రేట ఆట‌గాడు ఆకాశ్‌దీప్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్‌, జ‌డేజాలు ఒక్కొ వికెట్ సాధించారు. ఇప్ప‌టికే సిరీస్‌లో 1-2తో వెనుక‌బ‌డి ఉన్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం కీల‌కం. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.