Bumrah Kohli Debate: టిప్ప‌ర్ లారీకి బెంజ్‌కి తేడా లేదా?

ravichandran ashwin reacts on bumrah kohli debate

Bumrah Kohli Debate: విరాట్ కోహ్లీ అభిమానులు.. బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాపై ఆగ్ర‌హంగా ఉన్నారు. అలాగే బుమ్రా అభిమానులు కూడా కోహ్లీపై అంతే గుర్రుగా ఉన్నారు. ఇందుకు కార‌ణం ఏంటంటే.. ఓ ఇంట‌ర్వ్యూలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌లో ఎవ‌రు ఫిట్‌గా ఉంటారు అని అడ‌గ్గా.. వారిద్ద‌రూ కూదు నేనే ఫిట్‌గా ఉంటాను అని బుమ్రా అన‌డ‌మే. ఇక అక్క‌డి నుంచి ర‌చ్చ మొద‌లైంది. ఇప్పుడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఈ డిబేట్‌పై స్పందించడం అగ్గి మీద ఆజ్యం పోసినట్లైంది.

ఎందుకంటే అశ్విన్ కూడా బుమ్రాకే స‌పోర్ట్ చేసాడు. “” బుమ్రా ఇండియ‌న్ క్రికెట్‌కే కోహినూర్ వ‌జ్రం లాంటివాడు. 145 kmph స్పీడ్‌లో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌల‌ర్ ఇంకెవ‌రు ఉన్నారు చెప్పండి. అలాంటి బుమ్రా ఏది చెప్పినా వినాల్సిందే. దానికి ఇంత రచ్చ దేనికి. బుమ్రాకి గాయం అయితే అత‌ను ఫిట్టెస్ట్ క్రికెట‌ర్ ఎలా అవుతాడు అని కామెంట్స్ చేస్తారు. టిప్ప‌ర్ లారీకి బెంజ్‌కి చాలా తేడా ఉంటుంది. బెంజ్ చాలా ఖ‌రీదైన కారు కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్తగా చూసుకోవాలి. కానీ టిప్ప‌ర్ లారీ రెస్ట్ లేకుండా దూరాలు ప్ర‌యాణించాలి. నా ఉద్దేశంలో ఫాస్ట్ బౌల‌ర్ టిప్ప‌ర్ లారీతో స‌మానం. ఎంత ఒత్తిడిలో ఉన్నా బుమ్రా 145 kmphలో బంతిని విస‌ర‌గ‌ల‌డు. కాబ‌ట్టి అత‌నికి ద‌క్కాల్సిన క్రెడిట్ అత‌నికి ఇవ్వండి“” అని తెలిపారు.