Ravichandran Ashwin: పాకిస్థాన్‌ను చూస్తుంటే బాధ‌గా ఉంది

Ravichandran Ashwin feels bad for pakistan

 

Ravichandran Ashwin:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ ఘోరంగా ఓడిపోవ‌డంపై స్పందించారు ర‌విచంద్ర‌న్ అశ్విన్. ఒక‌ప్పుడు లెజండ‌రీ ఆట‌గాళ్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే పాకిస్థాన్ ఇప్పుడు 8వ స్థానానికి ప‌డిపోవ‌డం చూస్తుంటే బాధ‌గా ఉంద‌ని అన్నారు. 1965 త‌ర్వాత పాకిస్థాన్ రేటింగ్స్ ఇంత ఘోరంగా ప‌డిపోవ‌డం ఇదే తొలిసార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. పాకిస్థాన్‌పై గెలిచిన బంగ్లాదేశ్ ఎంతో మెరుగుప‌డింద‌ని కితాబిచ్చారు. 2021 త‌ర్వాత ద‌క్షిణాఫ్రికాపై గెలిచిన పాక్‌కు సొంత గ‌డ్డ‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క గెలుపు లేదు. బాబ‌ర్ ఆజాం ఇప్పుడు కెప్టెన్ కాక‌పోవ‌డం.. కొత్త కెప్టెన్‌గా షాన్ మ‌సూద్ రావ‌డంతో అత‌ను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాడ‌ని.. పాకిస్థాన్ క్రికెట్‌కు ఇలాంటి గ‌డ్డు కాలం వ‌స్తుంద‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని తెలిపారు.