Ravi Shastri: ఇది ధోనీ లాస్ట్ సీజ‌న్.. ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

Ravi Shastri: మ‌హేంద్ర సింగ్ ధోనీకి (MS Dhoni) ఈ ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజ‌న్ చివ‌రిద‌ని.. ఇక ధోనీ ఆడ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు మాజీ క్రికెట‌ర్ ర‌వి శాస్త్రి. ఆట అనేది ఆయన శ‌రీరం, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంద‌ని.. త‌న కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) అందించాడంటే ఇది త‌న చివ‌రి ఐపీఎల్ అని చెప్ప‌చ్చ‌ని అన్నారు.

ఈ సీజ‌న్‌లో కూడా మొత్తం ఆడ‌తాడా లేక మ‌ధ్య‌లో డ్రాప్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంద‌ని అన్నారు. అయితే రుతురాజ్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించే ముందు ధోనీ ర‌వి శాస్త్రికి ఓ విష‌యం చెప్పాడ‌ట‌. ఆట మ‌ధ్య‌లో కెప్టెన్సీని రుతురాజ్‌కు ఇవ్వ‌లేన‌ని. అందుకే లీగ్ మొద‌లుకావ‌డానికి ముందే ప్ర‌క‌టించేసాడ‌ని త‌న‌తో చెప్పిన‌ట్లు రవిశాస్త్రి తెలిపారు.

“” ధోనీ ఏం చెప్పాడో అదే చేసాడు. లీగ్ మ‌ధ్య‌లో కెప్టెన్సీని వ‌దులుకోవ‌డం కంటే ముందే రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్య‌తలు ఇవ్వాల‌నుకున్నాడు. తాను బ‌య‌ట నుంచి మాత్ర‌మే కెప్ట‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పాడు. ఎవ‌రికైనా సల‌హాలు త‌న సాయం కావాల‌నే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్పాడు. ర‌వీంద్ర జ‌డేజా కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు ధోనీ చాలా మ‌టుకు సాయం చేసాడు. కానీ ఈసారి అలా కాదు. డ్రింక్స్ బ్రేక్ స‌మ‌యంలో మాత్రమే స‌ల‌హాలు ఇస్తాన‌ని అన్నాడు “” అని ధోనీ తన‌తో వెల్ల‌డించిన‌ట్లు ర‌విశాస్త్రి తెలిపారు.